చౌటుప్పల్,అక్టోబర్08 (తొలివార్త )

చౌటుప్పల్ మండలంలోని జైకేసారం గ్రామంలోని ఎస్ఆర్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టేషనరీ,క్రీడా వస్తువులను అందజేశారు.గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చౌటుప్పల్ ఎస్ఐలు నర్సిరెడ్డి,రాంబాబు చేతుల మీదుగా విద్యార్థులకు స్టేషనరీ, డిక్షనరీలు,కాపీ రైటింగ్ బుక్స్,నోట్ బుక్స్,కలరింగ్ బుక్స్,డైరీలు మరియు క్రీడ లకు సంబందించిన చెస్ బోర్డులు,వాలీబాల్,రింగ్ బాల్,క్రికెట్ కిట్ తదితర ఆట వస్తువులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎస్ఐ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని,చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఎస్ఐ రాంబాబు మాట్లాడుతూ.. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి నేడు మీ ముందు అతిథిగా నిలబడ్డానని,మీరు కూడా బాగా చదివి మీరు చదివిన పాఠశాలకే ముఖ్య అతిథిగా వచ్చేలా కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఎస్ఆర్ లేబరేటరీస్ యాజమాన్యం దిలీప్ కృష్ణ, మౌనిక మాట్లాడుతూ.. తమ కంపెనీ తరపున గత 14 సంవత్సరాలుగా పాఠశాలకు ఇద్దరు విద్యా వాలంటీర్లను నియమించి వేతనం అందిస్తున్నామని, పాఠశాలకు అవసరమైన స్టేషనరీని కూడా సమకూరుస్తున్నామని తెలిపారు.గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు.గ్రామ సర్పంచ్ సమిరెడ్డి భారతమ్మ, జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలకు అందిస్తున్న సహకారానికి,గ్రామ అభివృద్ధికి తమ వంతు సహాయం అందిస్తున్న ఎస్ఆర్ ల్యాబ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జే.శ్రీనివాస్,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఏ.కె.రమాదేవి, ఉపాధ్యాయులు బి.సునంద,జి. వెంకటేశం,ఉప సర్పంచ్ బోదాసు స్వాతి వెంకటేష్, వార్డు సభ్యులు,గ్రామ ప్రజలు,విద్యార్థులతల్లిదండ్రులు పాల్గొన్నారు.