ఇంటికి మద్యం… ఇక తాగి దొరకటం కష్టం…

7

ఇంటికి మద్యం…  ఇక తాగి దొరకటం కష్టం… tolivaartha.com

మద్యం ప్రియులకు ఒక శుభవార్త అదేంటంటే ఆన్లైన్ షాపింగ్ మాదిరిగా మద్యం కూడా ఇంటికే రానుంది. ఇది ఎక్కడో తెలుసా..?? మహారాష్ట్ర. మద్యం ప్రియుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది. మద్యం తాగి ప్రాణాలు పోతున్న వారి కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులు ఎలక్షన్ సమయంలో మద్యపాన నిషేధం గురించి అనేకసార్లు వాగ్దానాలు చేస్తారు. కానీ అవేవీ జరగవని తెలుసు ఎందుకంటే మద్యం తాగడం సర్వ సాధారణం అయిపోయింది. లింగ భేదాలు లేకుండా అందరూ మద్యం సేవిస్తున్నారు.

ఈ క్రమంలో మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ సంఖ్య ఈ మధ్య ఎక్కువైపోయింది. ఇందుకు విరుగుడుగా మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఆన్లైన్లో మధ్య విక్రయించడం ఇకనుంచి మహారాష్ట్రలో ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు మద్యం ఇంటికి వచ్చేస్తుంది.

ఆన్లైన్ లో మద్యం ఆర్డర్ గురించి మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ ఇలా వెల్లడించారు ఆన్లైన్ లో మద్యం విక్రమ్ చేయాలంటే కనీస వయసు 21 ఉండాలి. పర్మిషన్ లేకుండా మద్యం విక్రయిస్తే ఆరు వేల నుంచి 30 వేల వరకు జరిమానా లేక ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుందని చెప్పారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2014 నుంచి 2016 వరకు జరిగిన రోడ్డు ప్రమాదంలో 2.5% మంది మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు.

ఈ వెసులుబాటుకు జియో ట్రాకింగ్ ఆడ్ చేస్తున్నారు ఈ పథకం మద్యం ప్రియులకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొసమెరుపు ఏంటంటే ఈ వార్త విన్న తెలుగు మద్యం ప్రియులు ఇక్కడ కూడా ఈ వెసులుబాటు ఉంటే చాలా బాగుండేది అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here